College | స్పార్క్ ఈడిఎక్స్ కంపెనీలో..

College | స్పార్క్ ఈడిఎక్స్ కంపెనీలో..
- 14 మంది వాగ్దేవి విద్యార్థులకు ఉద్యోగాలు
College | నరసరావుపేట, ఆంధ్రప్రభ : స్థానిక రావిపాడు రోడ్డులోని వాగ్దేవి డిగ్రీ కాలేజీ (అటానమస్) లో జరిగిన క్యాంపస్ డ్రైవ్ లో స్పార్క్ ఈడిఎక్స్ కంపెనీకి డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులు 14మంది ఇంగ్లీష్ కమ్యూనికేటివ్ ట్రైనర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారని కళాశాల (College) ప్రిన్సిపాల్ కపిలవాయి రాజేంద్రప్రసాద్ తెలిపారు. కంపెనీ ప్రతినిధులు పి.హనుమంతు రావు, ఎం.అభిరామ్ గుప్తా, కె.జాహ్నవి మొత్తం మూడు రౌండ్స్ నిర్వహించిన ఇంటర్వ్యూలలో వరుసగా బృంద చర్చలు, జామ్, హెచ్ ఆర్ రౌండ్స్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేసారు.
ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు ట్రైనింగ్ పూర్తయిన తరువాత రూ.2 లక్షల వార్షిక వేతనం ఉంటుందని తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు వెంటనే జాబ్స్ లో చేరతారని తెలిపారు. ప్రథమ సంవత్సరం నుండే విద్యార్థులకు (Students) ప్లేస్ మెంట్ సెల్ ద్వారా క్యాంపస్ రిక్రూట్ మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో శిక్షణ ఇవ్వడం ద్వారా తమ విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తున్నారన్నారు. ఈ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు 150మందికి పైగా విద్యార్థులు ఈ డ్రైవ్ కు హాజరయ్యారన్నారు.
ఫైనల్ రౌండ్ కి 16మంది విద్యార్దులు వెళ్లగా వారిలో 14మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు. ఈ సంవత్సరం నూరు శాతం ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంలో యాజమాన్యం ఉన్నారని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండంట్ రాయల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను కళాశాల చైర్మన్ (College Chairmen) కాట్ల రామకోటేశ్వరరావు, కళాశాల డైరెక్టర్స్ ఓగూరి నాగేశ్వరరావు, మద్దుల కోటేశ్వరరావు, సూదా సురేష్ బాబు, పాశం కృష్ణారావు, ఇస్కేపల్లి క్రిష్ణకిషోర్, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.
