State Govt | అనుభవం ఉన్న వ్యక్తిని ఒక్కసారి ఆదరించండి..
State Govt | వేల్పూర్, ఆంధ్రప్రభ : మీలో తిరిగిన వ్యక్తిని అనుభవం ఉన్న వ్యక్తిని అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి పుర్రె పద్మారావు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం(State Govt) నుంచి రావలసిన నిధులు కొట్లాడి తెప్పిస్తా అని, నేను ఆక్లూర్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పారు.
గ్రామంలో వైద్యం విద్య వసతులు కల్పిస్తానని, ఎన్నికల్లో మోసపోయి గోస పడకుండా ఉండాలంటే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించి గ్రామాభివృద్ధి(Rural Development)కి సహకరించవలసిందిగా సర్పంచ్ అభ్యర్థి సూచించారు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తా నాకు సహకరించండి.. నాకు ఒక్క అవకాశం ఇవ్వండని సర్పంచ్ అభ్యర్థి పుర్రె పద్మారావు విజ్ఞప్తి చేశాడు. బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించండి అని కోరారు.

