Naskal | సమస్యలు పరిష్కరిస్తా..

Naskal | సమస్యలు పరిష్కరిస్తా..
Naskal, నిజాంపేట, ఆంధ్రప్రభ : నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామ సర్పంచ్ గా తనను ఆదరించి గెలిపిస్తే.. అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి నాతి అంజమ్మ లక్ష్మా గౌడ్ అన్నారు. నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులతో కలిసి జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా నాతి అంజమ్మ లక్ష్మా గౌడ్ మాట్లాడుతూ.. గ్రామ సమస్యల పరిష్కరించేందుకు కృషి చేస్తానని.. సమస్యలను స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు దృష్టికి తీసుకెళ్లి గ్రామాభివృద్ధికి తోడ్పడుతానన్నారు. గ్రామస్తులు మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
