Schemes | కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి…

Schemes | కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి…

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్….

Schemes | దస్తూరాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే అన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయని ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఇవాళ‌ మండలంలోని మున్యాల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సంతపురి శారదా శ్రీనివాస్ గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందడానికి గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఉంటే సులభతరం అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం పార్టీ నాయకులు, కార్యకర్తలకు అవసరమ‌న్నారు అందరూ సమిష్టిగా కృషి చేసి గెలిపించాలని తెలిపారు. ఇందులో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులున్నారు.

Leave a Reply