Issues | సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలి

Issues | సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలి


Issues | బోధన్, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Election) సమర్ధులైన వ్యక్తులను ఎన్నుకొనేలా చూడాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సూచించారు. శుక్రవారం సాలూర మండలంలో అయన పర్యటించారు. గ్రామాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సుదర్శన్ రెడ్డిని కలిసి పలు సమస్యలపై చర్చించారు. గ్రామ అభివృద్ధికి పాటుపడే వారిని ఎన్నుకోవాలని సూచించారు. సుదర్శన్ రెడ్డి వెంట కాంగ్రెస్ నాయకులు ఇల్తెపు శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్, యువజన కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్, సొక్కo రవి, చింతం సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply