Midday Meals | పిల్ల‌ల‌తో క‌లిసి క‌లెక్ట‌ర‌మ్మ భోజ‌నం

Midday Meals | పిల్ల‌ల‌తో క‌లిసి క‌లెక్ట‌ర‌మ్మ భోజ‌నం

  • విద్యార్థుల సృజనాత్మకత‌కు అభినంద‌న

Midday Meals | కర్నూలు, ఆంధ్రప్రభ : కల్లూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్‌–టీచర్ మీటింగ్(Parent-Teacher Meeting) 3.0 కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి(Collector Dr. A. Siri) హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన సైన్స్ ఎగ్జిబిషన్ ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా వారి సృజనాత్మకతను అభినందించారు.

తరువాత జరిగిన సమావేశంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. విద్యా నాణ్యత, హాజరు, పాఠశాల–తల్లిదండ్రుల భాగస్వామ్యం త‌దిత‌ర అంశాలపై సూచనలు చేశారు. పాఠశాల అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలన్నారు. అనంతరం పాఠశాల మధ్యాహ్న భోజనం(Midday Meals)లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.