Hybrid seed | పత్తికి మద్దతు ధర..

Hybrid seed | పత్తికి మద్దతు ధర..

  • ఏ గ్రేడ్ పత్తికి క్వింటాల్‌ కు రూ.8100.
  • పత్తి పంట స్థానంలో మొక్కజొన్న సాగుతో లాభాలు
  • వరి కోయకాలు కాల్చితే భూసారం తగ్గుతుంది
  • పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు

Hybrid seed | పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తికి మద్దతు ధర లభిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(MLA Chintakunta Vijaya Ramana Rao) అన్నారు. పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి మహాలక్ష్మి జిన్నింగ్(Jinning) మిల్లులో గురువారం సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతు కలవెన మల్లేశంకు చెందిన 27 క్వింటాళ్ల 80 కిలోల పత్తిని మొదట కోనుగోలు చేశారు.

అనంతరం ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ… నాణ్యమైన ఏ గ్రేడ్ పత్తికి క్వింటాలుకు రూ.8100(Rs.8100) మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తున్నట్లు తెలిపారు. 8 నుండి 12శాతం(8 to 12 percent) లోపు తేమ ఉండేలా పత్తిని సిసిఐ కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని రైతులను కోరారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించక పంటల దిగుబడి తగ్గిందన్నారు.

రైతులు పంటల మార్పిడీపై దృష్టి సారించాలని సూచించారు. వరి పొలాలు కోసిన తరవాత కోయకాలుకు రైతులు నిప్పు పెట్టడం వల్ల భూసారం తగ్గుతుందని, పంటకు ఉపయోగపడే సారవంతమైన కీటకాలు నశించి పంటల దిగుబడి తగ్గుతుందని రైతులు పంట అవశేషాలను భూమిలో కలియదున్నాలని తెలిపారు.

పత్తి చివరి దశలో ఉన్నదని, దాని స్థానంలో యాసంగి సాగుగా మొక్కజొన్న సాగుతో అధిక లాభాలు పొందవచ్చన్నారు. హైబ్రిడ్ సీడ్(Hybrid seed) మొక్క జొన్న సాగుతో ఎక్కువ దిగుబడి సాధించి లాభాలు పొందవచ్చని, ఆ దిశగా రైతులు అడుగులేయాలని పిలుపునిచ్చారు. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల పంటల సాగుకు కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో జిన్నింగ్ మిల్ యజమానులు నర్సింగరావు, మంగారావు, సిసిఐ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply