Navya Bharati Global School | సినిమా పాటల్లో సాహిత్యం..

Navya Bharati Global School | సినిమా పాటల్లో సాహిత్యం..
సినీ గేయ రచయిత
వరి కుప్పల యాదగిరి
Navya Bharati Global School | నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ : సినిమా పాటలో సాహిత్యం ఉంటుందని సినీ గేయ రచయిత వరికుప్పల యాదగిరి(Varikuppala Yadagiri) అన్నారు. హరిత రచయితల సంఘం నిజామాబాద్ హరిదా సరస్వతీ రాజ్ సాహిత్యోత్సవం కార్యక్రమం నవ్య భారతి గ్లోబల్ స్కూల్లో(Navya Bharati Global School) ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీ గేయ రచయిత వరికుప్పల యాదగిరి హాజరై మాట్లాడుతూ… సినిమా పాటల్లో మంచి సాహిత్యం ఉంటుందని ఆయన తెలిపారు. మంచి మార్పు జీవితంలో వస్తే అది ఒక గుర్తుగా ఉంటుందని సందర్భంగా తెలిపారు. తొలిపొద్దు నవ్వింది అంటూ ఆయన పాట ఆకట్టుకుందన్నారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ నిర్వహించారు. నవ్య భారతి(Navya Bharati) విద్యాసంస్థల అధినేత క్యాతం సంతోష్ కుమార్, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాలేశ్వరం శంకరం, ప్రఖ్యాత కవులు చమన్, డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, అనిల్ ప్రసాద్, తిరుమల శ్రీనివాస్, నరాల సుధాకర్, ఆచార్య శ్రీధర, డాక్టర్ ఆనంద్ కుమార్, ఈ సందర్భంగా హరిదా సరస్వతీ రాజ్ తెలంగాణ విశిష్ట సాహిత్య పురస్కారం, సాహిత్య కథ రచన పురస్కారం, రచన కవిత రచన పురస్కారం, హరిత జిల్లా సాహిత్య పురస్కారాలను అందజేశారు.
