100 crores | రోడ్లు, డ్రైనేజీల పునరుద్ధరణకు రూ.100 కోట్లు ఇవ్వండి

100 crores | రోడ్లు, డ్రైనేజీల పునరుద్ధరణకు రూ.100 కోట్లు ఇవ్వండి
- రియల్-టైమ్ మానిటరింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి
- వరంగల్ నియోజకవర్గ అభివృద్దే ద్యేయం
- వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య
100 crores | ఆంధ్రప్రభ సిటీబ్యూరో, వరంగల్ : వరంగల్ సిటీలో అక్టోబర్ నెలలో మెుంథా తుఫాన్(Muntha Typhoon) కారణంగా కురిసిన వర్షాలు, తుఫాను వల్ల కలిగిన భారీ నష్టంపై వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య లోక్‌సభలో జీరో అవర్‌లో గళమెత్తారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 200 మిల్లీమీటర్ల(200 mm)కు పైగా వర్షం కురవడంతో శివనగర్, ఎన్ఎన్‌నగర్, డీకేనగర్ సహా 45 కాలనీలు తీవ్రంగా మునిగిపోయాయని ఎంపీ వివరించారు.
100 crores | మొంథా తుఫాన్ నష్టానికి సహాయం అందించండి

పోతన రోడ్, భద్రకాళి – పాలిటెక్నిక్ రోడ్, ములుగు రోడ్, బొందివాగు, పోచమ్మమైదాన్ 80 అడుగుల రహదారులు పూర్తిగా దెబ్బతిని గుంతలతో నిండిపోయాయని ఎత్తి చూపారు. కొన్నిచోట్ల రహదారులు నదులుగా మారాయని ఎంపీ డా.కడియం కావ్య పార్లమెంట్(Parliament) సమావేశంలో పేర్కొన్నారు. ఆ సమయంలో ఒక గర్భిణిని ట్రాక్టర్‌లో తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేసుకొన్నారు.
భారీ వర్షాల సమయంలో 1,200 మందిని 12 రిలీఫ్ క్యాంపులకు తరలించాల్సి వచ్చిందని ఎంపీ వెల్లడించారు. అమృత్–స్మార్ట్ సిటీల కింద చేపట్టిన డ్రైనేజీ పనులు 66శాతం మాత్రమే పూర్తికావడంతో ఈ దుర్ఘటన మరింత పెరిగిందన్నారు. ఇది పూర్తిగా ప్రణాళికా వైఫల్యమని వ్యాఖ్యానించారు.
100 crores | అమృత్ 2.0 కింద ప్రత్యేక నిధులు విడదల చేయాలి


అమృత్ 2.0 కింద ప్రత్యేక నిధులు మార్చి 2026 లోగా విడుదల చేయాలని కోరారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో మౌలిక వసతులపై ఉన్నత స్థాయి ఆడిట్ కు ఆదేశించాలని కోరారు. రహదారులు, డ్రైనేజీల పునర్నిర్మాణానికి రూ.100 కోట్లు(100 crores) తక్షణమే ప్రత్యేక ప్యాకేజీగా కింద ప్రకటించాలని కేంద్రాన్ని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య కోరారు.
100 crores | జి డబ్ల్యూ ఎం సి వసతులపై హై లెవల్ ఆడిట్ చేయాలి
హెరిటేజ్, స్మార్ట్ సిటీ(Smart City) అయిన వరంగల్ మహానగరం ప్రతి సంవత్సరం వర్షాలతో విధ్వంసం కాకుండా పటిష్టమైన, పకడ్బందీ చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కార దిశగా మౌలిక వసతులు కల్పించాలని ఎంపీ డా.కడియం కావ్య విజ్ఞప్తి చేశారు. వారసత్వ నగర అస్థిత్వం, ఉనికికి ముప్పు వాటిల్లకుండా చొరవను చూపాలని అభ్యర్థించారు.
