Central Zone | సన్నిత సెంటర్ ను ప్రారంభించిన పోలీస్ కమిషనర్

Central Zone | సన్నిత సెంటర్ ను ప్రారంభించిన పోలీస్ కమిషనర్

Central Zone | కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్(Police station) లో సన్నిత సెక్షన్ ను పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రారంభించారు. బుధవారం మిల్స్ కాలనీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన భవనంలో పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్(Sunpreet Singh) డీసీపీ దార కవిత, ఏసీపీ శుభం ప్రకాష్ లతో కలిసి ఆయన సన్నిత కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈసందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ… ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు, పనుల్లో జాప్యం నివారించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్(Central Zone) డీసీపీ ధార కవిత, ఏఎస్పీ శుభం ప్రకాష్, ఇన్ స్పెక్ట‌ర్‌ బొల్లం రమేష్, పోలీస్ అధికారులు, ఎస్సైలు, సురేష్ శ్రావణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply