weapons | కామాక్షి ఇళ్లు ధ్వంసం

weapons | కామాక్షి ఇళ్లు ధ్వంసం

  • కూలిన ఇళ్లల్లో మారణాయుధాలు లభ్యం

weapons | నెల్లూరు క్రైమ్, ఆంధ్రప్రభ : నెల్లూరు సీపీఎం కార్యకర్త పెంచలయ్య హత్యలో ప్రధాన నిందితురాలు.. గంజాయి డాన్ అరవ కామాక్షి(Kamakshi), ఆమె అనుచరుల ఇళ్లను స్థానికులు కూల్చివేశారు.

తమ కాలనీలో నేరగాళ్లకు స్థానం లేదంటూ ఆర్డీటీ కాలనీ(RDT Colony) వాసులు ఆగ్రహావేశాలు వెళ్లగక్కారు. కామాక్షి సహా ఆమె అనుచరుల 5 ఇళ్ళను కూడా ధ్వంసం చేసారు. ఆ సమయంలో కామాక్షి ఇంట్లో పలు రకాల మారణాయుధాలు(Lethal weapons) లభ్యం అయ్యాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు.