Farmer Dies : పిడుగు షాక్.. రైతు మృతి Andhra Prabha Crime News

Farmer Dies : పిడుగు షాక్.. రైతు మృతి Andhra Prabha Crime News
నందవరం మండలంలో విషాదం
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ.

Farmer Dies : కర్నూలు జిల్లాలో శుక్రవారం ఉదయం కురిసిన భారీ గాలివాన ఓ రైతు ప్రాణాన్ని బలితీసుకుంది. నందవరం మండలం ఇబ్రహీంపురం గ్రామానికి చెందిన రైతు బోయ కృష్ణ పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం, కృష్ణ తన ఎద్దుల కాడితో కలిసి పొలానికి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి భారీ గాలివాన ప్రారంభమైంది. దీంతో సమీపంలోని ఓ చెట్టు కింద ఆశ్రయం పొందేందుకు వెళ్లాడు. అదే సమయంలో పిడుగు పడటంతో చెట్టు విరిగి కృష్ణపై పడింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృష్ణను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. రైతు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతుండగా, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
