సర్పంచ్ బరిలో జవాన్ భార్య…

కమలాపూర్, ఆంధ్రప్రదేశ్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో ఒక సైనికుడి భార్య సర్పంచ్ పదవికి నామినేషన్లు దాఖలు చేయడం నేడు సంచలనంగా మారింది.
గ్రామాల్లో కొనసాగుతున్న గ్రూపు రాజకీయాల వల్ల ఎన్నో మంది సమస్యలు ఎదుర్కొంటున్నారని, తాము కూడా అలాంటి బాధితులలో ఒకరేనని అభ్యర్థి కాసురి మమత తెలిపారు. గ్రామ సమస్యల పరిష్కారం కోసం పెద్దలుగా చెప్పుకునే కొంతమంది నాయకుల వద్దకు వెళితే, వారు సమస్యలను మరింత క్లిష్టం చేసి తమ స్వ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించుకున్నారని, అసలు న్యాయం జరగలేదని ఆమె అన్నారు.
మా వీధికి సిసి రోడ్డు కోసం వీధివాసులమంతా సంబంధిత వార్డ్ మెంబర్‌ను సంప్రదించినప్పుడు కూడా అవహేళనపూర్వకంగా మాట్లాడారు. అందుకే ‘మన పని మనమే చేసుకుందాం’ అన్న ఉద్దేశంతో సర్పంచ్ బరిలోకి దిగాను అని మమత పేర్కొన్నారు.
వివిధ పార్టీల అభ్యర్థులకు సమానంగా పోటి ఇచ్చే ధైర్యం జనసేన పార్టీ కార్యకర్తల సహకారంతో వచ్చిందని ఆమె తెలిపింది. దేశ సేవలో సిఐఎస్ఎఫ్ జవానుగా ఉన్న తన భర్త కోరిక మేరకు గ్రామ అభివృద్ధి కోసం బరిలోకి దిగానని పేర్కొంది.
