Farmers | ‘రైతన్నా మీ కోసం’ కరపత్రాల పంపిణీ

Farmers | గూడూరు, ఆంధ్రప్రభ : గూడూరు మండలంలో గురువారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణ రావు, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ రైతుల వద్దకు వెళ్ళి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తునట్టు తెలిపారు. అన్నదాత సుఖీభవ ద్వారా రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.14 వేలు జమ చేశారని.. రాయితీపై యంత్రాలు అందించారని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన ఏకైక ప్రభుత్వం మాదేనని అన్నారు. ప్రతిపక్షాల విమర్శలను దాటుకుని మంచి సుపరిపాలన అందిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, నేతలు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
