Achampeta | కమ్మేసిన మంచు

Achampeta | కమ్మేసిన మంచు
ఉదయం 6.26 గంటలకు పట్టణం ముసిగిపోయిన దృశ్యాలు
Achampeta | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట (Achampeta) పట్టణం గురువారం ఉదయం గాఢమైన మంచు పొరలో కనుమరుగైంది. ఉదయం 06:26 గంటలకు నగరంలోని ప్రధాన రహదారులు పూర్తిగా మసకబారిపోయి దర్శనమిచ్చాయి. వీధి దీపాలు ఇంకా వెలిగే పరిస్థితి కనిపించగా, రహదారి రెండు వైపులా భవనాలు, వాహనాలు స్పష్టంగా కనిపించని స్థాయిలో పొగమంచు కమ్ముకుంది.
ప్రధాన రోడ్డుపై వాహన రాకపోకలు తక్కువగా కనిపించాయి. అప్పుడప్పుడు వెళ్తున్న వాహనాల హెడ్లైట్లు (Headlights) మాత్రమే మబ్బును చీల్చుకుంటూ అందరికీ కనబడుతున్నాయి. తీవ్రమైన పొగమంచు (Heavy fog) కారణంగా ఉదయపు ప్రయాణీకులు, విద్యార్థులు, ఉద్యోగులకు అసౌకర్యం ఏర్పడింది. వాతావరణ మార్పులతో వచ్చే రెండు మూడు రోజులపాటు కూడా ఇలాంటి పరిస్థితులు కొనసాగే అవకాశముందని స్థానికులు అంటున్నారు. పెరుగుతున్న చలిగాలుల పట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
