Tributes | దళిత ఉద్యమకారుడికి నివాళులు…
Tributes | హసన్ పర్తి, ఆంధ్రఫ్రభ : మృతి చెందిన కనకం యాదగిరి.. దళిత ఉద్యమానికి అందించిన సేవలు మరవలేనివని డీబీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రౌతు రమేష్ కుమార్, ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్ అన్నారు. హనుమ కొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రములోగురువారం మృతి చెందిన యాదగిరి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఉపాద్యాయులుగా పదవీవిరమణ పొందిన యాదగిరి అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షులుగా పని చేయడంతో పాటు నమ్మిన సిధ్దాంతానికి కట్టుబడి ఉండే నాయకులని కానియాడారు.
మృదు స్వభావి, స్నేహభిలాషి దళిత ఉద్యమానికి యాదగిరిఅలోచన విధానాన్ని, ఆశయాలను కొనసాగించాలని అన్నారు. యాదగిరి చిన్నతనం నుండే అంబేద్కర్ అలోచనలతో గ్రామ గ్రామాన అంబేద్కర్ యువజన కమీటిలను ఏర్పాటు చేసి దళితులను చైతన్య వంతులను చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ రాష్ట్ర నాయకురాలు బొర్ర సంపూర్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల అనిత, జిల్లా కార్యదర్శి చుంచు నరేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.
