School | మైనార్టీ పాఠ‌శాల ఆక‌స్మిక త‌నిఖీ..

School | మైనార్టీ పాఠ‌శాల ఆక‌స్మిక త‌నిఖీ..

  • విద్యార్థులతో రాజ్యాంగ ప్రతిజ్ఞ…

School | కోటగిరిన, ఆంధ్ర ప్రభ : మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాల(Gurukula School)ను ఆకస్మికంగా నిజామాబాద్ ఆర్ ఎల్ సీ బషీర్(RLC BASHIR) ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఆయన హాస్టల్ రిజిస్టర్లను, పాఠశాల ఉపాధ్యాయుల రిజిస్టర్, రిజిస్టర్లను, హాస్టల్ వసతులను పరిశీలించారు.

విద్యార్థులతో పాఠశాల విద్యను సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా విద్యార్థులతో రాజ్యాంగ ప్రతిజ్ఞ(Constitution Pledge) నిర్వహణలో పాల్గొని విద్యార్థులకు భారత రాజ్యాంగం ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఇటీవల బోధన్ విజయ మేరీ పాఠశాల‌(Bodhan Vijaya Mary School)లో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అబ్దుల్ కలిక్, హాస్టల్ వార్డెన్ అయాజ్, పాఠశాల సిబ్బంది ఉన్నారు.