Jagan Efect | డీఎస్పీపై వేటు-

Jagan Efect | డీఎస్పీపై వేటు-


నేతలతో పొసగని హిట్లర్ నైజం

అనంతపురం, ఆంధ్రప్రభ బ్యూరో : అనంతపురం రూరల్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు పై బదిలీ వేటు ( Ananthapuram ) – పడింది. హెడ్‌ క్వార్టర్‌ కు రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రధాన కారణం జగన్‌ పర్యటన ఎఫెక్ట్‌ అని పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు అధికార పార్టీ నాయకుల మధ్య చోటు-చేసుకున్న గ్యాప్‌ కూడా ఒక కారణంగా పేర్కొంటు-న్నారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్‌ రెడ్డి కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి మాజీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి హాజరైన సంగతి తెలిసిందే. తండోపతండాలుగా జనం రావడమే కాకుండా హైవే జన సంద్రంగా మారిపోయింది. ట్రాఫిక్‌ సమస్యలు ఇతర వ్యవహారాలను చక్కదిద్దకుండా డీఎస్పీ వదిలిపెట్టేసారన్న విమర్శలున్నాయి. వాస్తవంగా సీఐ స్థాయి అధికారి అక్కడి బాధ్యతలను పర్యవేక్షించాలి. వెంకటేశ్వర్లు నేరుగా రంగంలోకి దిగి భద్రతా ఏర్పాట్లు- సమీక్షించారు. పెద్ద సంఖ్యలో జనం వైసీపీ కార్యకర్తలు రావడం వల్ల అధికార పార్టీ పెద్దలకు రుచించలేదని దీని దెబ్బ హిట్లర్‌ పై పడిందని అంటు-న్నారు. మరోవైపు వెంకటేశ్వర్లు వాల్మీకి బోయ సామాజిక వర్గాల వ్యక్తి కావడంతో సబ్‌ డివిజన్లో ఆ సామాజిక వర్గంతో సన్నిహితంగా ఉండడం ఇబ్బందిగా మారింది. ఎస్సై నుంచి సీఐ, డీఎస్పీ వరకు జిల్లాలో సుదీర్ఘంగా వెంకటేశ్వర్లు పని చేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చోటు- చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పోలీసు అధికారులు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా ప్రతిపక్షాన్ని పెద్దగా పట్టించుకోకూడదు. ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలు వారిపై నిర్బంధాలను కొనసాగించి వారికి పెద్ద పీట వేస్తూ వస్తున్నారు. వెంకటేశ్వర్లు లాంటి అధికారులు జిల్లాలో సుదీర్ఘంగా పనిచేయడం వల్ల ఆచితూచి వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇది అధికార పార్టీ పెద్దలకు నచ్చని అంశంగా మారిందని పేర్కొంటు-న్నారు. జిల్లాలో చాలామంది పోలీసు అధికారులు ఇదే విధమైన ఇబ్బంది ఎదుర్కొంటు-న్నప్పటికీ, లూప్‌ లైన్‌ లో ఉండడం వల్ల అన్ని రకాల ఇబ్బందుల నేపథ్యంలో ఎంతో కొంత అధికార పార్టీని వ్యతిరేకించటం లేదు. పోస్టింగులు కాపాడుకోవడానికి వేరే మార్గం లేదని ఒక అధికారి తెలిపారు. బలహీన వర్గాలకు చెందిన వెంకటేశ్వర్లు పైన వేటు- వేయడం పట్ల వాల్మీకి బోయ సామాజిక వర్గం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply