Election | నేడే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్..

Election | నేడే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్..

Election | ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్‌డెస్క్: నేడు తెలంగాణ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఈసీ విడుద‌ల చేయ‌నున్నారు. జిల్లాల వారీగా రిజర్వేషన్ల గెజిట్లు(Gazettes Reservations) పంచాయతీరాజ్​ శాఖ కమిషనరేట్‌కు సోమ‌వారం చేరుకున్నాయి. 31 జిల్లాల నుంచి మూడుసెట్ల గెజిట్లు జిరాక్స్ కాపీలతోపాటు పెన్​డ్రైవ్‌లో తీసుకుని కమిషనరేట్లలోని హెల్ప్‌‌డెస్క్‌లో డీపీవో (DPO)లు అందజేశారు.

వాటిని పంచాయతీ రాజ్ అధికారులు పరిశీలించి, ఆ తర్వాత జిల్లాల వారీగా ఒక్కో సెట్ గెజిట్ కాపీలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి (State Election Commission) హ్యాండోవర్ చేశారు. మరో గెజిట్ కాపీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు (CS Rama Krishna Rao) పంపారు. ఈ క్రమంలో ఎస్ఈసీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రెడీ అయింది.