Maoists letter | తుపాకీ వీడుతాం

Maoists letter | తుపాకీ వీడుతాం

  • జనంలో కలుస్తాం
  • పార్టీలో సంప్రదిస్తాం
  • టైమ్​ ఇవ్వండి
  • పిబ్రవరి 15న ప్రకటిస్తాం
  • అప్పటి వరకూ భద్రత దళాల చర్యలు ఆపేయండి
  • పీజీఎల్​ఏ కూడా పని చేయదు
  • నమ్మండి.. చర్చిందుకుందాం
  • మహారాష్ట, మధ్యప్రదేశ్​, చత్తీస్​ గడ్​ సీఎంలకు వినతి మావోయిస్టు పార్టీ ఎంఎంసీ స్పెషల్​ జోన్​ కమిటీ అధికార ప్రతినిధి లేఖ విడుదల

Maoists letter | కేంద్ర ప్రభుత్వం తుది గడువు

( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ పత్రినిధి) చత్తీస్ గడ్.. మహరాష్ట, మధ్య ప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్లాల్లోని దండకారణ్యంలో,.. నలబై ఐదేళ్లు సమాంతర పాలన చేసిన మావోయిస్టు పార్టీ .. లొంగుబాటలోకి వస్తోందా? ప్తూర్తి స్థాయిలో  ఆయుధాలను వీడి జన స్రవంతిలోకి వస్తోందా? ఔను ఇప్పటికే మావోయిజం భావజాలంతో ,.. అడవిలో ఆకులు, అలములు  తింటూ పోరుబాటలో పయనించిన మావోయిస్టు పార్టీ అంతానికి కేంద్ర ప్రభుత్వం విధించిన తుది గడువు సమీపిస్తోంది.

Guns Down Maoists letter

Maoists letter | అనంత్ పేరిట ఓ ప్రకటన..

ఇప్పటికే ఇటీవల మహారాష్ట్ర పభుత్వాధినేత దేవేంద్ర పఢ్నవీస్ సమక్షంలో ఆయుధాలతో   మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోనూ దాదా (Sonu Dada)  , తక్కెళ్లపల్లి వాసుదేవరావు (Asamma)  తమ పటాలంతో లొంగిపోయారు. మోస్టు వాంటెడ్ మాడ్వి హిడ్మాను (Madvi Hidma)  ఏపీ పోలీసులు ఎన్​ కౌంటర్ చేశారు. ఈ స్థితిలో,, ఇక తాము తుపాకీలు  వీడుతున్నాం (Guns Will Surrend) , జనస్రవంతిలో (Join in People) కలుస్తామని, ఫిబ్రవరి 15 లోగా నిర్ణయాన్ని ( Dessissoin in February 15)  ప్రకటిస్తామని   మహారాష్ట్ర, -మధ్యప్రదేశ్, -ఛత్తీస్‌ గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ (MMC ) ప్రతినిధి  అనంత్  ( Spokes person Anantha) పేరిట ఓ ప్రకటన విడుదలైంది.

Maoists letter | పునరావాస ప్రణాళికను అంగీకరించాలని నిర్ణయం

దేశంలోనూ, ప్రపంచంలోనూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయుధాలను త్యజించి సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలివివేయాలని ప్రభుత్వం అందించే పునరావాస ప్రణాళికను అంగీకరించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఈ లేఖలో ( Realised Letter)  అనంత ప్రస్తావించారు. ఈ లేఖ సారాంశం ఇలా ఉంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Cm Padnavis), మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ Cm Mohan Ydav) , చత్తీస్ గడ్ సీఎం విష్ణుదేవ్  (Visnu Dev Sai), హోంమంత్రి విజయ్ సాయి (Vijay Sai) కి ఈ లేఖను పంపించారు.   CCM సతీష్ దాద,  CCM  చంద్రన్న ఇటీవల ఈ నిర్ణయాన్ని సమర్థించారు.

 Maoists letter

ఇక  MMC స్పెషల్ జోనల్ కమిటీ, కూడా ఆయుధాలను వీడి   ప్రభుత్వం కల్పించే  పునరావాసం (Rehabilation)   ప్రణాళికను అంగీకరించాలని నిర్ణయం తీసుకున్నట్టు అనంత్ పేర్కొన్నారు. ఈ  మూడు రాష్ట్ర ప్రభుత్వాలు తమకు తగిన సమయం ఇవ్వాలని   అభ్యర్థించారు. మావోయిస్టు  పార్టీ ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు కట్టుబడి ఉన్నందున,  సమష్టిగా  ఈ నిర్ణయం తీసుకోవటానికి కొంత సమయం డుతుందని,    ఈ సందేశాన్ని సహచరులకు చేర్చటానికి  సమయం కావాలని అనంత కోరారు.  ఫిబ్రవరి 15, 2026 వరకు  సమయం ఇవ్వాలని  మూడు రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నట్టు అనంత వివరించారు.  “ నన్ను నమ్మండి, ఇంత సమయం అడగడానికి మాకు ఎటువంటి నిగూఢ ఉద్దేశ్యం లేదు.

Guns Down Maoists letter : తుపాకీ వీడుతాం

Maoists letter

త్వరగా కమ్యూనికేట్ చేయడానికి మాకు వేరే సులభ మార్గాలు లేనందున, దీనికి ఇంత సమయం పడుతుంది. ఇది కొంచెం ఎక్కువ అని   అర్థం చేసుకున్నాం, కానీ ఇది మావోయిజాన్ని అంతం చేయడానికి ప్రభుత్వం విధించిన గడువు  ( Last Date  March  31, 2026) లోపే ఉంది. అప్పటి వరకు, మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు కొంత సంయమనం పాటించాలని  భద్రతా దళాల కార్యకలాపాలను నిలిపివేయాలి (Should be Stop) ” అని అనంత కోరారు.  రాబోయే రోజుల్లో  PLGA  ఎటువంటి ఆపరేషన్లు కూడా నిర్వహించకూడదు.   ఇన్‌ఫార్మర్లపై (Informers)  దాడులు ఆపాలి 

Maoists letter | మావోయిస్టులకు అనంత  విజ్ఞప్తి

Maoists letter | ఇన్‌పుట్‌లు,  సమాచారం ఆధారంగా బలగాలను నియమించాలి. అని అనంత్ కోరారు. ఈసారి   People liberation Gerrilla Army)  వారోత్సవాన్ని జరిపేది లేదని,  కార్యకలాపాలను పాజ్ చేస్తామని కూడా అనంత హామీ ఇచ్చారు.  ఇరు వైపుల  ఇటువంటి ప్రయత్నాలతో మాత్రమే మెరుగైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ నిర్ణయం ఆహ్లాదకరం  (Pleasant) , సానుకూలమవుతుంది, అని అనంత పేర్కొన్నారు.  ఈ ప్రక్రియ ముందుకు సాగే వరకు అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని జోన్ లో మావోయిస్టులకు అనంత  విజ్ఞప్తి చేశారు.

 ఒకరితో ఒకరు చర్చలతో  సమష్టిగా (Collectively)  మెరుగైన నిర్ణయానికి రాగలం,  నిస్సందేహంగా, ప్రభుత్వ దృక్కోణం నుండి ఫలితం ఆహ్లాదకరం సానుకూలం (positive)  అవుతుంది.    ఈ సందేశాన్ని  వీలైనంత త్వరగా సహచర మావోయిస్టులకు చేరేలా రాబోయే కొన్ని రోజులు ఈ అభ్యర్థనను రేడియో (Rdio)లో ప్రసారం చేయాలని   ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.  దేశం , ప్రపంచం నుండి రోజువారీ వార్తలను తెలుసుకోవడానికి  తమకు అధునాతన మాధ్యమం లేదని,  రోజువారీ తాజా వార్తలను తెలుసుకోవడానికి సహచర మావోయిస్టులకు  ఇదే ఉత్తమ మార్గమని అనంత వివరించారు. 

ఈలోగా, మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు  ,  ప్రజా ప్రతినిధులు (people leades) , జర్నలిస్టులతో సమావేశమయ్యే అవకాశాన్ని తమకు ఇవ్వాలని అనంత ఆశాశాభావం వ్యక్తం చేశారు.   త్వరలోనే సా మూహికంగా ఆయుధాలను వీడి  ప్రభుత్వ పునరావాస ప్రణాళికను అంగీకరిస్తూ    ఒక నిర్దిష్ట తేదీని ప్రకటించగలమని అనంత పేర్కొన్నారు.  తాము పేర్కొన్న తేదీ వరకు భద్రతా దళాలు కార్యకలాపాలను  (Armed Forees) తాత్కాలికంగా ( Tempararly) నిలిపివేసి,  అనుకూల  వాతావరణాన్ని సృష్టిస్తేనే ఇది సాధ్యమవుతుంది అని అనంత స్పష్టం చేశారు. 

ఈ అభ్యర్థనపై  ప్రభుత్వ ప్రతిస్పందన ( Government Response) కోసం   వేచి ఉంటామని,  రాబోయే కొద్ది రోజులు సాయంత్రం ప్రాంతీయ వార్తా ప్రసారానికి ముందు రేడియోలో మా ప్రకటననను, ప్రభుత్వ ప్రతిస్పందనను ప్రసారం చేయాలని కోరారు.సహచర మావోయిస్టులు  సోను దాదా, సతీష్ దాదాలను కూడా మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు తమ కేసును సమర్పించి,   తగిన సమయం ఇవ్వాలని కోరుతున్నాం. మావోయిస్టులు, ప్రభుత్వానికి ప్రజా స్ఫూర్తిదాయక  ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులు,  యూట్యూబ్ జర్నలిస్టులు  మధ్యవర్తిత్వం వహించాలని విజ్ఞప్తి చేశారు.

Read This Artical  నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి

Click Here To Read More

Leave a Reply