Bahrain High Alert : బహ్రెయిన్ గజగజ Andhra Prabha News
Bahrain High Alert : బహ్రెయిన్ గజగజ Andhra Prabha News
- అమెరికా వార్నింగ్‌తో హై అలెర్ట్
- క్షిపణి, డ్రోన్ దాడుల ముప్పు
- డేటా సెంటర్లు, చమురు నిల్వలు లక్ష్యం
- ప్రజలకు హెచ్చరికలు
- సురక్షిత ప్రాంతాలకు తరలాలని సూచన
- కీలక స్థావరాలపై దాడుల భయం..
- బయటకు రావొద్దని ఆదేశాలు..
- ఇళ్లలోనే ఉండాలని సూచన
( ఆంధ్రప్రభ, మనామ ప్రతినిధి)

ఇరాన్ పై కొన్ని గంటల్లో భీకర దాడి తప్పదని అమెరికా ఫైనల్ వార్నింగ్ నేపథ్యంలో.. అమెరికా మిత్ర దేశం బహ్రెయిన్ అప్రమత్తమైంది. మంగళవారం ఏప్రిల్ 7, 2026, భారత కాలమానం ప్రకారం ఉదయం 7.30 గంటలలకు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Interior) అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ నుంచి క్షిపణులు, డ్రోన్ ల దాడులు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో దేశవ్యాప్తంగా సైరన్లు మోగించారు.
Bahrain High Alert : సురక్షిత ప్రాంతాలకు తరలండి

“సైరన్లు మోగించడమైనది. పౌరులు, నివాసితులు ప్రశాంతంగా , వెంటనే సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరుతున్నాం” అని మంత్రిత్వ శాఖ తన అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. గత కొన్ని వారాలుగా ఇరాన్, ఇజ్రాయెల్ అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో బహ్రెయిన్‌పై పలుమార్లు దాడులు జరిగాయి. ముఖ్యంగా అమెరికా సైనిక స్థావరాలున్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఈ దాడులు చేస్తోంది.
Bahrain High Alert : బయటకు రావొద్దు

గత 24 గంటల్లో బహ్రెయిన్ రక్షణ దళాలు ఇరాన్ నుండి వచ్చిన సుమారు 8 డ్రోన్లను అడ్డుకున్నాయి. ఏప్రిల్ 4న జరిగిన దాడుల్లో డ్రోన్ శకలాలతో సిత్రా (Sitra) ప్రాంతంలో నలుగురు గాయపడ్డారు. కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి. బహ్రెయిన్‌లోని అమెజాన్ క్లౌడ్ (AWS) డేటా సెంటర్, కొన్ని చమురు నిల్వ కేంద్రాలపై కూడా దాడులు జరిగినట్లు నివేదికలు అందుతున్నాయి.జలు ప్రధాన రహదారులపైకి రావొద్దని, కిటికీలు మూసివేసి ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
