Youth | నిరుద్యోగులకు అండగా..

Youth | నిరుద్యోగులకు అండగా..


Youth |పొందూరు (ఆమదాలవలస), ఆంధ్రప్రభ : పొందూరు సిస్టం కాలేజీ ప్రాంగణంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ (AP Skill Development and Training) వారు నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పీయుసీ చైర్మన్ కూన రవికుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో నిరుద్యోగ యువత హాజరైయ్యారు. వివిధ సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా యువతతో మాట్లాడిన ఎమ్మెల్యే రవికుమార్ నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కూటమి ప్రభుత్వం (A coalition government) ఎప్పటికప్పుడు యువతకు అండగా ఉండి ఉపాధి, ఉద్యోగాల కల్పనలో ముందుండి పని చేస్తోందని భరోసా ఇచ్చారు. యువత తమ సామర్థ్యాలను పెంచుకొని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పలు సూచనలు, సలహాలు చేశారు. జాబ్ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ విభాగాల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాలేజీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply