POWER | తాటికొండకు ఎక్స్ ప్రెస్ ఫీడర్..
POWER | తాటికొండకు ఎక్స్ ప్రెస్ ఫీడర్..
POWER | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ: వ్యవసాయ విద్యుత్ సరఫరాకు సంబంధం లేకుండా గ్రామంలోని నివాస, వాణిజ్య సముదాయాలకు ప్రత్యేకంగా ఎక్స్ ప్రెస్ ఫీడర్ ప్రారం భించడానికి సామాగ్రి సిద్ధంగా ఉంది. త్వరలో గుత్తేదారుకు పనులు అప్పజెప్పి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రామ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తామని ఎన్పిడిసిఎల్ ఏఈ పి.శంకర్ (P.Shankar) చెప్పారు. శనివారం స్టేషన్ ఘన్ పూర్ మండలంలోని తాటికొండ గ్రామంలో ఘన్ పూర్ టౌన్ ఏఈ ఆపరేషన్ పగిడిముంతల శంకర్ ఆధ్వర్యంలో రైతు పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ భూముల్లో రైతులకు విద్యుత్ సరఫరాలో ఉన్న సమస్యలను తెలుసుకొని యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహించారు. ఈసందర్బంగా ఏఈ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతీ వారం ఒక గ్రామంలో వ్యవసాయ క్షేత్రాల్లో రైతు పొలంబాట కార్యక్రమం నిర్వహించి రైతుల సమస్యలు సాధ్యమై నంత వరకూ అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామని చెప్పారు.
తాటికొండ లో ఇప్పటివరకు వదులుగా ఉన్న విద్యుత్ తీగలను గుర్తించి 11కేవి లైన్లో40, ఎల్టీ లైన్లో 12 మధ్యస్థ స్థంబాలను నాటించి ప్రమాదాల ను నివారించామన్నారు. ఇంకా 30స్థంబాలు నాటించే కార్యక్రమం జరుగు తుందని చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో బ్రేక్డౌన్ల సత్వర పరిష్కారం కోసం 11కేవి లైన్లో పన్నెండు, సింగిల్ పేస్ నియంత్రికల వద్ద మూడు ఆన్ఆఫ్ సిస్టమ్ ఏబిస్విచ్ లను భిగించామని చెప్పారు. అంతే కాకుండా వినియోగదారులు బకాయిలు లేకుండా విద్యుత్ బిల్లులు (Electricity Bills) సక్రమంగా చెల్లించాలని, భద్రతా సూత్రాలను పాటిస్తూ ప్రమాదాలను నివారించా లని కోరారు. ఈకార్యక్రమంలో తాటికొండ లైన్మెన్ దేవి సురేందర్ రెడ్డి, అన్మ్యాండ్ వర్కర్ యార రాజేందర్, రైతులు నర్రెంగల చేరాలు, నాగరాజు, సాంబరాజు, పుట్ట ఉప్పలయ్య, ఉబ్బని జన్న య్య, పండుగ అశోక్, నూనెముంతల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
