CPM| రాప్తాడులో బ్రిడ్జి ఏర్పాటు చేయండి: సీపీఎం పార్టీ

CPM| రాప్తాడు, ఆంధ్రప్రభ: నాలుగు రోడ్లు వెంబడి నిత్యం వేలాది వాహనాలు భారీ వాహనాలు రైతాంగ ఉత్పత్తులు తోలే వాహనాలు నిత్యం తిరుగుతుంటాయని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు రామాంజనేయులు పేర్కొన్నారు. రాప్తాడు మండల కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న రాప్తాడు చెన్నై హైవే ధర్మవరం కందుకూరు అనంతపురం నాలుగు రోడ్డులు సర్కిల్ లో యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని సీపీఎం పార్టీ కోరుతోందన్నారు. రాప్తాడు రైల్వే గేటు దగ్గర హైవే అధికారులు డిజైన్ లోపం వల్ల బ్రిడ్జి లేకపోవడం వల్ల నిత్యం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలో ఇలాంటి సంఘటనలు రోజు చూస్తున్నాము.. కాబట్టి తక్షణం జిల్లా ఎంపీ ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ నేషనల్ హైవే అధికారులు తక్షణం స్పందించి యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.

ప్రతిరోజు ఎమర్జెన్సీ రోగులు నిత్యం బెంగుళూరు వెళ్తుంటారు. విద్యార్థులు కియా కార్మికులు ఉద్యోగులు ఏపీఐఐ సి వర్కర్స్ పైపుల్ ఫ్యాక్టరీ వర్కర్స్ అండ్ ఉద్యోగస్తులు వ్యవసాయ కూలీలు గొర్రెలు మేకలు పశువుల కాపర్లు రైతులు కార్మికులు ప్రజలందరూ 24 గంటలు వాహనాల్లో ఆటో ధర్మవరం ఇటు అనంతపురం నగరానికి తిరుగుతుంటారు. ఇలాంటి ప్రదేశంలో బ్రిడ్జి లేకపోవడం భవిష్యత్తులో తీవ్రమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాల రంగయ్య, రాప్తాడు రూరల్ ప్రాంతీయ కమిటీ సభ్యులు పుష్పరాజ్, కమిటీ సభ్యులు సుబ్బారావు, కమిటీ సభ్యులు సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.