SINGING| వందేమాతరం గేయానికి 150 ఏళ్లు..

SINGING| ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి: బంకించంద్ర చటర్జీ రచించిన జాతీయ గీతం వందేమాతరం గేయాన్ని వందేమాతరం ఉత్సవ కార్యక్రమాల జిల్లా కన్వీనర్ జాడి వెంకట్ ఆధ్వర్యంలో 300 విద్యార్థులు 100మంది యువకులతో కలసి గీతాలాపన చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం హాజరై మాట్లాడారు. వందేమాతర జాతీయ గేయానికి 150 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా 2025 నవంబర్ 7 నుంచి సంవత్సరం పాటు భారత కేంద్ర ప్రభుత్వం వందేమాతరం ఉత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించడం సంతోషకరమన్నారు.
వందేమాతర గీతాలపనతో గళమెత్తిన యావద్దేశం దేశ ప్రజలలో వందేమాతరం గేయం స్ఫూర్తితో బ్రిటిష్ వలసవాదులను తరిమికొట్టడానికి యావత్ భారత దేశ ప్రజల చైతన్యానికి ఇదొక మంత్రంలా పని చేసిందని అన్నారు. ఆ నాడు స్వాతంత్ర సమరానికి దేశవ్యాప్తంగా వందేమాతరం స్ఫూర్తిదాయక గేయంగా ప్రజలందరికీ హృదయాలలో నిలిచింది పోరాట ప్రతిమను నిలిపిందని అన్నారు. వందేమాతరం అంటే ఒక ప్రార్థనగా భావిస్తామని.. భారతదేశాన్ని మేల్కొని మేలుకొల్పిన తొలి మంత్రం వందేమాతరం గేయమయిందని.. అన్ని వర్గాల ప్రజలకు ఐక్యం చేసిన ఘనత వందేమాతరం సొంతమని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతలపూడి భాస్కర్ రెడ్డి, ఆజ్మీర క్రిష్ణవేణి నాయక్, భూఖ్య జవహర్ లాల్, నగరపు రమేష్, కార్యక్రమ కో-కన్వినర్లు బైకాని మహెందర్, అల్లే శోభన్, గుగులోతు స్వరూప, జినుకల కృష్ణాకర్ రావు, చందా జ్యోతి, మండల లవన్, రాయంచు నాగరాజు, యస్ విశ్వనాథ్, కొత్త సుధాకర్ రెడ్డి, జాడి రామరాజు, వాసుదేవ రెడ్డి,పల్ల బుచ్చయ్య, రవిరెడ్డి, సిద్దబోయిన సురెందర్, వావిలాల జనార్ధన్, గండెపల్లి సత్యం, కత్తి హరీష్, మేరుగు సత్యనారాయణ, గాదం కుమార్, మార్క సతీష్, లక్ష్మణ్, వినుకొల్లు చక్రవర్తి, పైడాకుల మల్లేష్, సమ్మక్క, సంగీత, సుమలత తదితరులు పాల్గొన్నారు.
