Telangana | విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ‌…

Telangana | విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ‌…

Telangana | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : నర్సింహులపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవాన్నిఈ రోజు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి పలువురిని ఆకట్టుకున్నారు.

కలెక్టర్ గా సందీప్, డీఈవోగా రాంచరణ్, ఎంఈఓగా జస్వంత్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా సంఘవిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రామ్మోహన్ రావు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply