4,265 workers | 4,265 మంది కార్మికులు సభ్యులుగా…
4,265 workers | 4,265 మంది కార్మికులు సభ్యులుగా…
- -ఇళ్ల రిజిస్ట్రేషన్, సొసైటీ సభ్యత్వం వెంటనే ఇవ్వాలి..
- సీపీఐ(ఎంఎల్ ) మాస్ లైన్ డిమాండ్..
4,265 workers | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : నారాయణపేట పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన చేనేత కార్మికులకు న్యాయం చేయాలని, వారికి ఇళ్ల రిజిస్ట్రేషన్‌తో పాటు సహకార సంఘంలో సభ్యత్వం వెంటనే కల్పించాలని చేనేత కార్మిక సంఘం (టియూసిఐ) నాయకులు డిమాండ్ చేశారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని తాయమ్మ గుడి ప్రాంగణంలో ఈ రోజు చేనేత కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ(ఎం ఎల్ ) మాస్ లైన్ డివిజన్(Mass Line Division) కార్యదర్శి కె. కాశీనాథ్, చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకుడు కెంచె నారాయణ మాట్లాడుతూ.. 1951లో స్థాపించబడిన నారాయణపేట చేనేత సహకార సంఘంలో ఒకప్పుడు 4,265 మంది కార్మికులు(4,265 workers) సభ్యులుగా ఉన్నారని గుర్తుచేశారు.
గాంధీనగర్ కాలనీలో వంద మంది కార్మికులకు సొసైటీ ఇళ్లు నిర్మించి ఇచ్చినప్పటికీ, కార్మికుల నుంచి ప్రతినెల 5 రూపాయల(Rs. 5 per month) చొప్పున సొసైటీ వసూలు చేసిన మొత్తం 2,475 రూపాయలు, అలాగే ప్రభుత్వం, సొసైటీ నిర్ణయించిన మొత్తం మొత్తాన్ని కార్మికులు 35 సంవత్సరాల క్రితమే పూర్తిగా చెల్లించారని తెలిపారు.
గాంధీనగర్ వాసుల ఇళ్లను, స్థలాలను వెంటనే రిజిస్టర్ చేయకపోతే సీపీఐ(ఎం ఎల్ ) మాస్ లైన్, చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నరసింహులు, నాగేందర్, సచిన్ తదితరులు పాల్గొన్నారు.
