AP | అది.. అత్యంత దారుణం..
AP | అది.. అత్యంత దారుణం..
AP, కోడూరు, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అత్యంత దారుణమని అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైసీపీ (YCP) కన్వీనర్ సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం కోడూరులో నిర్వహించారు.
ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుటిల ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మెడికల్ కళాశాలలను ప్రారంభించడం జరిగిందని, పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువు చేసి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటు అయిన తర్వాత మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణకు తీర్మానించినట్లు తెలిపారు.
ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరుతూ ప్రజల నుంచి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాలను ప్రజలకు వివరించారు. ప్రజల స్వచ్ఛందంగా వచ్చి సంతకాలను చేసి తమ మద్దతును తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీ నేతలు పాల్గొన్నారు.

