Vikarabad | నిలిచిన డయాలసిస్ సేవలు

Vikarabad | నిలిచిన డయాలసిస్ సేవలు

Vikarabad | వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ (Vikarabad) జిల్లా కేంద్రంలో డయాలసిస్ సేవలు నిలిపివేతతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్‌లో త్రిఫేజ్ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో డయాలసిస్ సేవలు (dialysis services) ఉదయం ఐదు గంటల నుంచే పూర్తిగా ఆగిపోయాయి.

దీంతో చికిత్స కోసం వచ్చిన పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి వేచి చూసినా సేవలు పునరుద్ధరించక పోవడంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, విద్యుత్ సమస్య (Electrical problem) పరిష్కారం కానంత వరకు డయాలసిస్ ప్రారంభం అసాధ్యమని పేర్కొన్నారు.

Leave a Reply