Breaking News| కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి

Breaking News| కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి
Breaking News| హైదరాబాద్, ఆంధ్రప్రభ : నిధుల దుర్వినియోగంపై మాజీ మంత్రి కేటీఆర్ (KTR) పై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీంతో ఏసీబీ కేటీఆర్ పై అభియోగాలు నమోదు చేయనుంది. విచారణ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశముంది. ఫార్ములా ఈ కేసు (Formula E case) లో త్వరలో ప్రాసిక్యూషన్ జరగనుంది.
ఇప్పటికే కేటీఆర్ (KTR) నాలుగుసార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. కేసులో ఏ1గా కేటీఆర్ (KTR), ఏ2గా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఉన్నారు. ఇప్పటికే అరవింద్ కుమార్ పై డీఓపీటీకి ప్రభుత్వం లేఖ రాసింది. కేంద్రం అనుమతి ఇస్తే అరవింద్ పై అభియోగాలు నమోదు చేసే అవకాశముంది.
