DEATH| గుర్తు తెలియని వ్యక్తి మృతి

DEATH| నల్లమాడ, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండల కేంద్రంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మరణించినట్లు గురువారం వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రంలోని ఈశ్వరయ్య వాటర్ ప్లాంట్ వెనుక గల ప్రాంతంలో మృతదేహం పడి ఉన్న విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు తెలిపారు. మృతదేహం పక్కనే ఏపీ 39 విసీ 4315 నెంబర్ ఆటో కూడా ఉంది. గుజిరి సరుకుతోలుకొనే వ్యక్తిగా స్థానికులు భావిస్తున్నారు. పూర్తి సమాచారం పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. నల్లమాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply