ACB | చెవిరెడ్డి పిటిషన్ పై విచారణ..
ACB | చెవిరెడ్డి పిటిషన్ పై విచారణ..
ACB, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నేడు ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి (Chevireddy) పిటిషన్ పై విచారణ జరగనుంది. జైలులో తనను కలిసేందుకు కుటుంబ సభ్యులతో పాటు.. లాయర్లకు వారంలో మూడు ములాఖత్‌లు ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఇంటి భోజనంతో పాటు రాసుకునేందుకు ఒక టేబుల్, డీటీహెచ్ కనెక్షన్ తో టీవీ తదితర సదుపాయాలు కల్పించాలని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం సాయంత్రం విజయవాడలోని ఏసీబీ కోర్టులో వేసిన పిటిషన్ పై వాదనల నిమిత్తం న్యాయవాది మంగళవారానికి వాయిదా వేశారు.
