Murder | భర్త చేతిలో భార్య…

Murder | భర్త చేతిలో భార్య…
Murder | మోతె, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా (Suryapet district) మోతె మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో అర్ధరాత్రి జరిగిన దారుణ ఘటన సిరికొండ గ్రామంలో కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త కారింగుల వెంకన్న గౌడ్ తన భార్య కారింగుల పద్మ (Karingula Padma) (40)ను రోకలి బండతో కొట్టి హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు.
హత్య చేసిన వెంటనే వెంకన్న స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు (Police) సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి మధ్య సాగుతున్న దాంపత్య కలహాలే ఈ ఘటనకు కారణమని స్థానికులు చెబుతున్నారు. మోతె ఎస్సై అజయ్ కుమార్ (Ajay Kumar) కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

