Accident | లారీ ఢీ కొట్టి…

Accident | లారీ ఢీ కొట్టి…

Accident | తిమ్మాపూర్ (ఆంధ్ర ప్రభ) : తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల వద్ద రాజీవ్ రహదారిపై తీవ్ర రోడ్డు ప్రమాదం (road accident) చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన యువకుడు కళ్లెం శ్రీనివాస్ (Kallem Srinivas)(18) ఇంటి వద్ద నుంచి కరీంనగర్ కు బయలుదేరుతున్న క్రమంలో వెనుక నుండి వేగంగా వస్తున్న లారీ యువకుడ్ని ఢీకొట్టడంతో లారీ కింద పడి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు.

యువకుడు లారీ (Lorry) కింద పడి చూసి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతి దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ఎం డి ఎస్ఐ తెలిపారు.

Leave a Reply