Srisailam | ఉమామహేశ్వర స్వామిని దర్శంచుకున్న ప్రిన్స్ మహేశ్ సోదరి

Srisailam | ఉమామహేశ్వర స్వామిని దర్శంచుకున్న ప్రిన్స్ మహేశ్ సోదరి
Srisailam | అచ్చంపేట, ఆంధ్రప్రభ : దివంగత సినీ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ(Superstar Krishna) కుమార్తె, సినీ హీరో మహేశ్ బాబు సోదరి ఘట్టమనేని ప్రియదర్శి శ్రీశైలం ఉత్తర ద్వారంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ ఉమామహేశ్వర స్వామి(Sri Umamaheswara Swamy) క్షేత్రంలోని మల్లికార్జున స్వామిని దర్శంచుకున్నారు.
ఈ రోజు ఆమె స్నేహితులతో కలసి ఇక్కడకు వచ్చారు. వారికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం మల్లికార్జున స్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఘట్టమనేని ప్రియదర్శిని(Ghattamaneni Priyadarshini) మాట్లాడుతూ.. ఉమామహేశ్వర క్షేత్ర ప్రకృతి రమణీయత, స్వామి వారి దర్శనం చేసుకోవడం ఎంతో ఆధ్యాత్మిక చింతన కలిగించిందన్నారు.

