MP KESINENI | న‌గ‌రాల అభ్యున్న‌తికి చేయూత

  • అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తాం..
  • వనసమారాధనలు ఐక్యతకు చిహ్నాలు
  • న‌గ‌రాల వ‌న‌స‌మారాధ‌నలో విజయవాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ వెల్ల‌డి

MP KESINENI | విజ‌య‌వాడ, ఆంధ్రప్రభ : కార్తీక మాసంలో చేసే పూజ కార్య‌క్ర‌మాలు వ‌ల్ల ఎంతో పుణ్య‌ఫ‌లం ల‌భిస్తుందని, ప్ర‌జ‌లంద‌రూ ఒక చోట క‌లిసి భోజ‌నం చేయ‌టం ఐక్య‌త‌కు చిహ్నమ‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. ఆంధ్రప్ర‌దేశ్ న‌గ‌రాల యువ‌జ‌న సంఘం ఆధ్వ‌ర్యంలో జ‌క్కండ‌పూడి పాముల‌కాల‌వ ద‌గ్గ‌ర న‌గ‌ర‌వనం అట‌వీ శాఖ పార్క్ ప్రాంగ‌ణంలో ఆదివారం వనసమారాధన కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఎంపీ కేశినేని శివ‌నాథ్ ముఖ్యఅతిథిగా హాజ‌రై పూజ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ మాట్లాడుతూ న‌గ‌రాల అభివృద్ధి, సంక్షేమంతో పాటు వారి అభ్యున్న‌తికి కృషి చేస్తానన్నారు. నగరాల అవసరాల కోసం అనునిత్యం అందుబాటులో ఉంటూ వారికి చేయూత అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆంధ్రప్ర‌దేశ్ న‌గ‌రాల యువ‌జ‌న సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు బాయిన బెనర్జీ, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వి.శ్ర‌వ‌ణ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్ర‌దేశ్ న‌గ‌రాల యువ‌జ‌న సంఘం అధ్య‌క్షుడు గూడెల మ‌ణికంఠ‌, సంఘం నాయ‌కులు రాయ‌న అరుణ్ కుమార్, విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యం బోర్డ్ మెంబ‌ర్ సుఖాసి స‌రిత‌, ఏపీ న‌గ‌రాల సంక్షేమ అభివృద్ది కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్లు సుఖాసి కిర‌ణ్‌, బేవ‌ర సాయి సుధాక‌ర్, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ తెలుగు యువ‌త అధ్య‌క్షుడు ఆర్.మాధ‌వ‌, చిట్టిన‌గ‌ర్ దేవ‌స్థానం స‌భ్యులు, ఆంధ్ర ప్ర‌దేశ్ న‌గ‌రాల యువ‌జ‌న సంఘం స‌భ్యులతో పాటు తదిత‌రులు పాల్గొన్నారు.