America| రెండు విమానాలు ఢీ – ఇద్దరు మృతి

వాషింగ్టన్‌: అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మరో రెండు చిన్న విమానాలు ఢీకొన్న ‍ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.

ప్రమాదం జరిగిన వెంటనే భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో రెండు చిన్న విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.

అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం రన్‌వే-12పై విమానాలు సెస్నా 172S, లాంకైర్ 360 MK II ఢీకొన్నట్టు జాతీయ రవాణా భద్రతా బోర్డు తెలిపింది. ఈ రెండు విమానాలు ఫిక్స్‌డ్‌-వింగ్‌, సింగిల్‌ ఇంజిన్‌ విమానాలని పేర్కొంది. ఈ ఘటనలో మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply