Child Labour | డేంజర్ జర్నీ!

Child Labour | డేంజర్ జర్నీ!
- నిబంధనల ఉల్లంఘన… అయినా పట్టించుకోరా?
Mahabubnagar | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రమాదాలు జరిగితే తప్ప అధికారులకు నిబంధనలు గుర్తుకు రావు… నిత్యం ఎక్కడో ఓ చోట వాహనాలు ప్రమాదాలకు గురవ్వడం… అందులో ప్రయాణిస్తున్న(traveling) వారు మృత్యువాత పడటం.. క్షతగాత్రులుగా ఆస్పత్రులో చేరడటం చూస్తునే ఉన్నాం! ప్రమాదాలు జరగకముందే మేల్కోంటే ఏంతో ఉపయోగకరంగగా ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించినా వాహనదారులపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రతి ఒక్కరీ ప్రశ్న!
ఓవర్ లోడ్…
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల(Ootkur Mandal) పరిధిలోని వాహనదారులు పరిమితికి మించి జనాలు ఎక్కించుకుంటున్నారు. ఈ రోజు ఓ వాహనంలో కిటకిటలాడుతూ జనాలను తరలించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వాహనంలో అందరూ మైనర్లు కూడా ఉండడం విశేషం. ఇలాంటి ప్రయాణాలు అడ్డుకోవాలని… ప్రమాదాలు జరగకముందే మేల్కోవాలని… పలువురు కోరుతున్నారు.
పత్తి పనులకు తరలి వెళుతున్న మైనర్లు…
ప్రస్తుతం పత్తి పంటలో పనులు జరుగుతున్నాయి. ఈ రోజు సెలవు కావడం(Vacationing)తో విద్యార్థులు కూడా పైసలు సంపాదించుకోవడం కోసం కూలికి వెళుతున్నారని సమచారం. ఓవర్ లోడుతో వెళుతున్న వాహనంలో విద్యార్థులు కూడా ఉన్నారు. నిబంధనలు ప్రకారం బాల కార్మికుల(Child Labour)ను పెట్టుకుంటే నేరం. కానీ తక్కువ కూలికి దొరుకుతున్నారన్న ఆశతో కొందరు రైతులు విద్యార్థులను కూలి పనికి తరలిస్తున్నారని తెలిసింది. నిబంధనలు ఉల్లంఘించి బాలకార్మికులను ప్రోత్సహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
