Karimabad | 17న పెన్షనర్స్ చలో హైదరాబాద్

Karimabad | 17న పెన్షనర్స్ చలో హైదరాబాద్

పెన్షనర్ల ధర్నా విజయవంతం చేయాలి
జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబయ్య


Karimabad | కరీమాబాద్, ఆంధ్రప్రభ : రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ బకాయిల డబ్బులు వెంటనే విడుదల చేయాలని వరంగల్ ఎస్ జి పి ఏ టి పెన్షనర్స్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గునిగంటి సాంబయ్య (Guniganti Sambaiah) పిలుపునిచ్చారు. శనివారం వరంగల్ 34 డివిజన్ విగ్నేశ్వర కాలనీలో పెద్దూరు పెద్దయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి గునిగంటి సాంబయ్య పాల్గొని మాట్లాడుతూ.. 2024 మార్చిలో రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు నేటి వరకు చెల్లించలేదన్నారు.

ప్రభుత్వం (government) నుంచి రావలసిన బకాయిలు రాకపోవడంతో కొందరు మృతిచెందడం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పెన్షనర్స్ జాక్ పిలుపుమేరకు ఈనెల 17న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో జరిగే ధర్నాలో వరంగల్ (Warangal) జిల్లా నుండి అధిక సంఖ్యలో పెన్షనర్స్ (Pensioners) పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కోశాధికారి నిమ్మకాయల సదానందం, శివనగర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పెద్దూరి పెద్దయ్య, బత్తుల సత్యం, ఆర్ వి చలం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply