Accident | 3 కి.మీ. లాక్కెల్లినా!

Accident | 3 కి.మీ. లాక్కెల్లినా!

  • తప్పిన ప్రాణాపాయం…!

ఉమ్మ‌డి ఆదిలాబాద్‌, ఆంధ్రప్రభ : జాతీయ రహదారిపై మోటార్ సైకిలిస్టును లారీ ఢీ కొట్టి 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన అదిలాబాద్(Adilabad) జిల్లాలో చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు మోటార్ సైకిల్(Motorcycle) పై ఉన్న వ్యక్తి లారీ ఢీ కొట్టిన ఘటనలో ఎగిరి బయటకు పడడంతో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. తలమడుగు మండలం దహేగాంకు చెందిన ఆత్రం రాంజీ తన బైక్ పై ఇంటికి వెళుతుండగా వెనుక నుండి వచ్చిన ట్రక్కు ఢీ(truck collision) కొట్టింది. రాంజీ ఈ ప్రమాదంలో ఎగిరి రోడ్డు పక్కన పడగా స్వల్ప గాయాలయ్యాయి. అయితే ట్రక్కు కంటైనర్ ముందు భాగంలో ఇరుక్కుపోయిన మోటర్ బైక్‌ను తెలియకుండానే డ్రైవర్ (Driver)3 కిలోమీటర్ల వరకు ఆపకుండా ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకెళ్ళారు. పోలీసులు వెంబడించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని మావల పోలీసులు కేసు నమోదు చేశారు. స్వల్ప గాయాలైన రాంజీని ఆసుపత్రికి త‌ర‌లించారు, చికిత్స పొందుతున్నాడు.

Leave a Reply