Mopidevi | స్వామి వారి సేవలో సీఐడీ ఎస్పీ..
Mopidevi, ఆంధ్రప్రభ : మోపిదేవిలో (Mopidevi) ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సీఐడీ ఎస్పీ చక్రవర్తి (CID SP Chakravarthy) ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దేవస్థానానికి విచ్చేసిన చక్రవర్తిని ఆలయ సూపర్డెంట్ అచ్యుత మధుసూదన్ రావు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి, శ్రీ స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.

