వెలుగులోకి సీసీటీవీ ఫుటేజ్

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో సంచలనం రేపిన హత్య–ఆత్మహత్య కేసులో కీలక సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. నారాయణవనం పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
సీసీటీవీ ఫుటేజ్‌లో మోహన్ తన ఇద్దరు పిల్లలతో కలిసి స్కూటీపై వెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. ఈ ఆధారాలు కేసు విచారణలో కీలకంగా మారాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో మోహన్‌కు ఆర్థిక లేదా కుటుంబ సమస్యలు లేవని తేలింది. తన సోదరికి ఉన్న అప్పుల కోసం బుధవారం ఉదయమే కొంత నగదును ఓ వ్యక్తికి ఇచ్చినట్లు సమాచారం.
అయితే తన తల్లి, భార్యను ఎందుకు హత్య చేశాడన్నది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఈ కేసులో రైల్వే పోలీసులు మోహన్, అతని ఇద్దరు పిల్లల మృతిపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
