Payyavula Keshav | అన్నదాత సుఖీభవకు రూ.6,300 కోట్లు

Payyavula Keshav | అన్నదాత సుఖీభవకు రూ.6,300 కోట్లు
Payyavula Keshav | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ‘తల్లికి వందనం’ పథకానికి రూ.9,407 కోట్లు, ‘అన్నదాత సుఖీభవ’కు రూ.6,300 కోట్లు కేటాయించారు. గత ఏడాది 11.75% వృద్ధి రేటు సాధించామని, ఈసారి 10.75% వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం శక్తిమంతంగా మారిందని పేర్కొన్నారు.


