సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ‌ (ACB) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో భాగంగా కార్యాలయంలోని అన్ని రకాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

రిజిస్టర్ అయిన పత్రాలను నేరుగా ప్రజలకు ఇవ్వకుండా, మధ్యవర్తులైన డాక్యూమెంట్ రైట‌ర్ల‌ వద్దకు పంపుతున్నారనే ఫిర్యాదులు రావడంతో ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయా లేదా అన్న దానిపై ఏసీబీ అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు.

ఈ తనిఖీల్లో అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ సాంబయ్య, ఇన్‌స్పెక్టర్లు ఎస్. రాజు, ఎల్. రాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply