Nalgonda | పున‌రావృతం కాకుండా…

Nalgonda | పున‌రావృతం కాకుండా…

Nalgonda | నల్గొండ, ఆంధ్ర ప్రభ : మెడికల్ కళాశాలలో ఇటీవల జరిగిన ర్యాగింగ్ సంఘటనలు పునరావృతం కావద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(Tripathi) కమిటీ సభ్యులకు సూచించారు. నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల ర్యాగింగ్ వ్యతిరేక జిల్లా స్థాయి కమిటీ ఈ రోజు జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన సమావేశమై ఇటీవల ప్రభుత్వ వైద్య కళాశాలలో సంభవించిన ర్యాగింగ్ సంఘటనలపై చర్చించారు.

భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సమావేశంలో నిర్ణయించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్(District SP Sarath Chandra Pawar), రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ జె.సత్యనారాయణ, ఇన్చార్జి డీఆర్ఓ వై. అశోక్ రెడ్డి, డిఎస్పి శివరాం రెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాల అదనపు ప్రిన్సిపల్ ఆర్ రాధాకృష్ణ, సామాజిక కార్యకర్త సురేస్ గుప్తా, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటింటెంట్ అరుణకుమారి, విద్యార్థి సంఘాల ప్రతినిధులు,హాజరయ్యారు.

Leave a Reply