3500 houses | పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు

3500 houses | పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు
3500 houses | దేవరకొండ, ఆంధ్రప్రభ : రాబోయే 3 సంవత్సరాలలో దేవరకొండ నియోజకవర్గంలో ఇండ్లు లేని నిరుపేదలకు పదివేల ఇండ్లు నిర్మించి ఇస్తామని దేవరకొండ శాసనసభ్యుడు నేనావత్ బాలు నాయక్(Nenavat Balu Naik) అన్నారు. ఈ రోజు ఆయన దేవరకొండ నియోజకవర్గ కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో నేరేడుగోమ్ము, చందంపేట, చింతపల్లి మండలాలకు చెందిన 5 గ్రామాలలోని 115 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ(3500 per Indiramma) ఇండ్లు నిర్మించి ఇస్తున్నదని తెలిపారు. అర్హత ఉండి ఇందిరమ్మ ఇండ్లు రాని లబ్ధిదారులకు లాటరీ ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఎంపిక చేయడం జరిగిందని, ఇల్లు రాకుండా మిగిలిపోయిన వారు నిరాశ పడవద్దని, అనంతరం వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లు(Indiramma houses) పంపిణీ చేస్తామని తెలిపారు.
దేవరకొండ పట్టణంలో గతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్(double bedroom) ఇండ్లలో సరైన వసతులు లేని కారణంగా లబ్ధిదారులకు ఇబ్బందులు కలుగుతాయని, మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన బడ్జెట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. కాగా నేరేడు గోమ్మలో 20 మంది లబ్ధిదారులకు, ఇదే మండలం ఎనుగోతు తండాలో 25 మంది లబ్ధిదారులకు, చందంపేట మండలం, గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన 25 మంది లబ్ధిదారులకు, చింతపల్లి మండలం అనాజిపూర్ గ్రామానికి చెందిన 25 మంది లబ్ధిదారులకు, ఇదే మండలం నిలవలపల్లికి చెందిన 20 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను శాసనసభ్యులు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో సంబంధిత మండలాల తహసిల్దారులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, పిఎసిఎస్ చైర్మన్ లు , అధికారులు, తదితరులు హాజరయ్యారు.

