Karimabad : వెంట‌నే విధుల్లోకి తీసుకోవాలి…

Karimabad : వెంట‌నే విధుల్లోకి తీసుకోవాలి…

కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రామీణ తపాలా ఉద్యోగుల న్యాయమైన హక్కుల కొరకు పోరాడుతున్న ఆలిండియా ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ మహాదేవయ్యను కక్ష పూరితంగా, అప్రజాస్వామికంగా(undemocratically) సర్వీస్ నుండి తొలగించడం సరికాదని వెంటనే తమ నేతను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య(Kadiyam Kavya)కి, గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు బొద్దున వెంకటేశ్వర్లు(Bodduna Venkateswarlu) వినతి పత్రం అందజేశారు.

2023 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం నియమించిన కమలేష్ చంద్ర కమిటీ సానుకూల సిఫార్సులను అమలు చేయాలని పలుమార్లు నిరసన తెలియజేసినా స్పందించక పోవడంతో నాలుగు రోజులు నిరవధిక సమ్మె చేయడం జరిగింది. అట్టి చట్టబద్ధమైన సమ్మెను గుర్తించి తమ డిమాండ్లను అమలు చేయకపోగా అప్రజాస్వామికంగా(Bodduna Venkateswarlu) తమ నేతను విధుల్లో నుండి తొలగించడం పట్ల దేశవ్యాప్తంగా లక్షలాదిమంది గ్రామీణ తపాలా ఉద్యోగులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారనీ ఆయన అన్నారు.

ఇప్పటికైనా వ్యక్తిగతమైన కక్ష సాధింపు ధోరణి విడనాడి మహాదేవయ్యను విధుల్లోకి తీసుకోవడానికి ఎంపీ కావ్య తమ వంతు సహాయం అందించవలసిందిగా ఈ రోజు ఎంపీకి వినతి పత్రం అందజేయడం జరిగిందని బొద్దున వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పెరుమాండ్ల తిరుపతి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Leave a Reply