బాంబు పేలుళ్ల‌తో అల‌ర్ట్…

బాంబు పేలుళ్ల‌తో అల‌ర్ట్…

  • బాంబు స్క్వాడ్, జాగిలాలతో విస్తృత తనిఖీలు

గోదావరిఖని, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపం(Near Red Fort Delhi)లో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ రోజు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ పోలీసుల నేతృత్వంలో నగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పారిశ్రామిక నగరంలో రద్దీగా ఉండే ప్రాంతాలలో పోలీసులు బాంబు స్క్వాడ్(Police bomb squad), జాగిలాలతో తనిఖీలు చేపట్టారు.

జనసంచారం ఎక్కువగా ఉండే ఏరియాలలో పోలీసులు అడుగడుగునా సోదలు జరిపారు. పట్టణంలోని గోదావరిఖని బస్టాండ్(Godavarikhani Bus Stand), ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, అదేవిధంగా ప్రధాన చౌరస్తా, లక్ష్మీ నగర్ బజార్, ఓల్డ్ అశోక్ థియేటర్ ఏరియా తోపాటు నగరంలోని వివిధ ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.

అదేవిధంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలోని ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా సోదా చేశారు. అదేవిధంగా నిత్యం రద్దీగా ఉండే దుకాణ సముదాయాల ప్రాంతాల్లో నిలిచి ఉన్న వాహనాలను బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. నిత్యం వేలాదిమంది ప్రయాణం చేసే నగరంలోని బస్టాండ్ ప్రాంతాన్ని(Bus Stand Area) బాంబు స్క్యాడ్ బృందం తనిఖీలు జరిపింది. అనుమానం వచ్చిన వస్తువులను జాగిలాలతో సోదాలు చేశారు. పట్టణ ఎస్ఐ అనూష(SI Anusha) తో పాటు బాంబు స్క్వాడ్, జాగిలాల బృందం పాల్గొంది.

Leave a Reply