ఇసుక ట్రాక్ట‌ర్ బోల్తా…

ఇసుక ట్రాక్ట‌ర్ బోల్తా…

  • ప్ర‌భుత్వ ఖ‌జానాకు న‌ష్టం క‌లిగిస్తే క‌ఠిన చ‌ర్య‌లే…

కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని టెలిఫోన్ బీడీ కంపెనీ(Telephone Beedy Company) సమీపంలో ఇసుక ట్రాక్టర్ బోల్తా పడినట్లు కమ్మర్ పల్లి ఎస్ఐ జి. అనిల్ రెడ్డి ఈ రోజు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని హస కొత్తూర్ గ్రామంలో బస్టాండ్ వద్ద విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏకు భీమ్ గల్ వైపు నుంచి కమ్మర్ పల్లికి వస్తున్న ఇసుక ట్రాక్టర్ టీఎస్ 16 యుబి 8863 నెంబర్ గల ట్రాక్టర్ లో బ్లూ రంగు తాటిపత్రి కప్పి ఉన్న ట్రాలీని గమనించి ట్రాక్టర్ పట్ల అనుమానం రావడంతో వెంటనే వెంబడించి హాస కొత్తూరు గ్రామంలోనీ గురడికాపు స్మశాన వాటిక వద్ద ట్రాక్టర్ ను ఆపి డ్రైవర్ ను ప్రశ్నించారు. ట్రాక్టర్ డ్రైవర్(Tractor Driver) పల్లపు.

సాయికుమార్ వేల్పూర్ మండలం అక్లూరు గ్రామానికి చెందినవాడని, ట్రాక్టర్ యజమాని వేముల భాస్కర్(Vemula Bhaskar) భీంగల్ కు చెందినదని తెలిసింది. తన యజమాని ఆదేశాల మేరకు భీంగల్ మండలం కుప్కాల్ గ్రామంలోని ఓర్రె నుండి ఇసుకను లోడ్ చేసుకొని కమ్మర్ పల్లికి చెందిన మాధవ్ మేస్త్రికి ఇసుకను అమ్మడానికి తీసుకు వస్తున్నట్లు పేర్కొన్నాడు. ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు తేలడంతో హాస కొత్తూరు వీఆర్ఏ ఈ విషయాన్ని ఆర్ఐ శరత్ కు తెలియజేశాడు.

వారి ఆదేశాల మేరకు ట్రాక్టర్ ను కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్(Police Station)కు అప్పగించేందుకు ప్రయత్నిస్తుండగా ట్రాక్టర్ డ్రైవర్ సాయికుమార్(Tractor Driver Saikumar)ట్రాక్టర్ తో తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేశాడు. మార్గ మధ్యంలో కమ్మర్ పల్లిలోని బైపాస్ టెలిఫోన్ బీడీ కంపెనీ సమీపంలో ట్రాక్టర్ ను అతి వేగంగా, అజాగ్రత్తగా నడపడంతో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ట్రాక్టర్ డ్రైవర్ కు ఎలాంటి గాయాలు కాలేదు.

ఈ ఘటనలో డ్రైవర్ సాయికుమార్, ట్రాక్టర్ యజమాని వేముల భాస్కర్ లు ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే ప్రయత్నం చేసినందుకు ట్రాక్టర్ ను సీజ్ చేసి సంబంధితులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు కమ్మర్ పల్లి ఎస్ఐ జి. అనిల్ రెడ్డి తెలిపారు.

Leave a Reply