డిపోలోనే ఢీకొట్టిన బస్సు..

డిపోలోనే ఢీకొట్టిన బస్సు..

ఆర్టీసీ ఉద్యోగి…

వికారాబాద్ జిల్లా, పరిగి: పరిగి ఆర్టీసీ డిపోలో సోమవారం ఉదయం దుర్ఘటన చోటుచేసుకుంది. డిపోలో డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్‌గా పనిచేస్తున్న కుద్దూస్ (Kuddus) (56) ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం… డిపో నుండి బయటకు వస్తున్న బస్సుకు బ్రేక్ (Bus brake) పనిచేయకపోవడంతో అది ముందు నిలబడి ఉన్న కుద్దూస్‌ను ఢీకొట్టింది. బస్సు బలంగా ఢీకొనడంతో కుద్దూస్ తలకు తీవ్ర గాయాలు కాగా, సంఘటనా స్థలంలోనే మరణించారు.

ఇంకా మూడేళ్ల సర్వీస్ ఉండగానే డిపార్ట్మెంట్‌లోనే ప్రాణాలు కోల్పోవడం డిపో సిబ్బందిని కలచివేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.